శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (18:35 IST)

సురేఖను ముద్దులతో ముంచెత్తిన కొడుకు, కోడలు.. ఎందుకు..?

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు బుధవారం. ఆమె పుట్టిన రోజును కుటుంబ సభ్యులు ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన అయితే సురేఖను ముద్దుల్లో ముంచెత్తారట. ఆమె పుట్టినరోజుకి భారీ గిఫ్ట్ అదేనంటూ చెబుతోంది ఉపాసన.
 
హ్యాపీ బర్త్ డే ఆంటీ అంటూ ఇన్‌స్ట్రాగ్రాంలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది ఉపాసన. తన భర్త రాం చరణ్‌తో కలిసి సురేఖ పక్కన ఉపాసన నిలబడి ఉన్న ఫోటో అది. అలా ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది.
 
రాం చరణ్, ఉపాసనలకు పెళ్ళయినప్పటి నుంచి సురేఖ ఉపాసనను కోడలిగా కాకుండా కూతురిగానే చూసుకుంటూ వచ్చింది సురేఖ. అందుకే సురేఖ అంటే ఉపాసనకు ఎంతో అభిమానం. 
 
తన ఇన్‌స్ట్రాగ్రాంలో భర్త కన్నా ఎక్కువగా అత్త ఫోటోలే ఉంటుందంటే ఆమెపై ఉన్న ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. తాను సురేఖలో అత్త కన్నా అమ్మగానే ఎక్కువగా చూసుకుంటూ ఉంటానని సందేశాలు కూడా పంపింది.