శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (12:26 IST)

చిరు - వెంకీ కాంబినేషన్‌లో చెర్రీ మెగా ప్రాజెక్టు...

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ హీరో వెంకటేష్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కె అవకాశం ఉంది. ఈ మెగా ప్రాజెక్టుకు హీరో రాం చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నిజానికి ఒకవైపు హీరోగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాతగా పక్కా ప్రణాళికతో చిత్రాలను నిర్మిస్తున్నారు. 
 
ఈ కోవలోనే ప్రస్తుతం చెర్రీ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో వరుసగా సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా ప్రస్తుతం చెర్రీ దగ్గర రెండు రీమేక్ సినిమాలు రెడీగా ఉన్నాయి. 
 
మలయాళంలో విజయం సాధించిన 'లూసిఫర్', 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రాల రీమేక్ రైట్స్‌ను చెర్రీ కొనుగోలు చేశారు. ఇందులో లూసిఫర్‌ను చిరు కోసం పక్కన పెట్టిన చెర్రీ.. డ్రైవింగ్ లైసెన్స్‌ను మరో హీరోతో నిర్మించాలని అనుకుంటున్నారట.
 
ఈ క్రమంలో ఈ కథ విక్టరీ వెంకటేష్ సరిగ్గా సరిపోతారని చెర్రీ భావిస్తున్నారట. అందుకే త్వరలోనే వెంకటేష్‌ను కలిసి ఈ రీమేక్ కోసం ఒప్పించాలని అతడు ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే చిరు కాకుండా మరో హీరోతో చెర్రీ నిర్మించే మొదటి చిత్రం ఇదే అవుతుంది. అయితే తన నిర్మాణ సంస్థలో మిగిలిన హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తానని అప్పట్లో ఓ సందర్భంలో చరణ్ వెల్లడించారు. 
 
అలాగే యంగ్ హీరోలతో సైతం తాను సినిమాలు తీస్తానని చెర్రీ తెలిపిన విషయం తెలిసిందే. మరి డ్రైవింగ్ లైసెన్స్‌లో ఎవరు నటిస్తారు..? చెర్రీ ఆఫర్‌కు వెంకీ ఓకే చెప్తారా..? ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు..? అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.