శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (11:05 IST)

కుమార్తెతో కలిసి తొలిసారి శ్రీవారిని దర్శించుకున్న చెర్రీ దంపతులు

ram charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి బుధవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన కుమార్తె క్లీంకారతో కలిసి వారు తొలిసారి తిరుమలకు చేరుకున్నారు. తన పుట్టినరోజు కావడంతో తమ బిడ్డతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ సుప్రభాత సేవలో పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా కుటుంబంతో కలిసి వారు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
ram charan couple
 
శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో రామ్ చరణ్ దంపతులకు వేద పండితులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైవు రామ్ చరణ్‌ను పలుకరించేందుకు భక్తులతో పాటు ఆయన అభిమానాలు అమిత ఉత్సాహాన్ని చూపారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూసేందుకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయం వద్దకు తరలివచ్చారు.
ramcharanupasana