శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (10:37 IST)

'గేమ్ ఛేంజర్' పాట లీక్.. క్రిమినల్ కేసు నమోదు

game changer
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో "గేమ్ ఛేంజర్" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలోని ఓ పాటను ఆడియో రూపంలో లీక్ అయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా గుర్తించింది. దీంతో చిత్రం యూనిట్ సభ్యులు హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చిత్రంలోని పాట ఆడియో లీక్‌ అయినట్టు గుర్తించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్రిమినర్ కేసులు కూడా నమోదు చేశారని 'గేమ్ ఛేంజర్' చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. 
 
ఐపీసీ 60 (సి) కింద ఈ క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని 'గేమ్ ఛేంజర్' పాటను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ కంటెంట్‌ను అక్రమంగా బయటకు విడుదల చేశారని, వీరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏమాత్రం నాణ్యతలేని ఆ కంటెంట్‌ను మరింత వ్యాప్తి చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు.