మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:59 IST)

రామ్ గోపాల్ వర్మ తాజా ట్వీట్.. నా ఓటు నోముల భగత్‌కే..! Video

ఆర్జీవీ.. కాంట్రవర్సీకి నిలువెత్తు రూపం. జాతీయ రాజకీయ నాయకుల నుంచి టాప్ సినీ ప్రముఖుల వరకూ ఎవరైనా డోంట్ కేర్ అన్నట్లుగా ఆర్జీవీ వివాదాస్పద కామెంట్లు చేస్తుంటారు. అంతేకాకుండా, అంతర్జాతీయ నాయకుల నుంచి హైదరాబాద్ మేయర్ వరకూ తనకు నచ్చిన రీతిలో ట్రోల్స్ వదులుతూ ఉంటారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసినా అందులో వెటకారం పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు మరో యువ నేత లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ వదిలారు.
 
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కేనని వర్మ తెలిపారు. 
BagathNomula


చిరుతపులితో నోముల భగత్‌ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ ఈ విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను సింహం, పులితో పోల్చిన రాంగోపాల్‌ వర్మ ఈ వీడియో చూసిన తర్వాత చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళ్లిన నోముల భగత్‌ను ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు