మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (11:34 IST)

అనుపై మనసుపడిన పూరీ జగన్నాథ్.. ఆ పాత్రలో ఛార్మీ?

పూరీ జగన్నాథ్.. ఒకపుడు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు. 'పోకిరి' వంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు. ప్రస్తుతం ఈయన వరుస ప్లాపులతో ఇబ్బందిపడుతున్నారు. అయినప్పటికీ ఓ మంచి హిట్ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులోభాగంగా రామ్ హీరోగా "ఐస్మార్ట్ శంకర్" అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా వెల్లడించి, ఈ మూవీపై భారీ అంచనాలే పెంచాడు. అయితే, ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అనూ ఎమ్మాన్యుయేల్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. 
 
ఈమెతో పాటు మ‌రో హీరోయిన్‌కి కూడా ఇందులో న‌టించే అవ‌కాశం ఉండ‌గా, పూరీ ఎవరిని ఎంపిక చేస్తారా అనే సందేహం అంద‌రిలో నెల‌కొంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకునిరానున్నారు. ఈ చిత్రానికి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.