బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (18:18 IST)

మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

Rana Daggubati, Paruchuri Sudarshan
Rana Daggubati, Paruchuri Sudarshan
‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. 
 
 ట్రైలర్ విడుదల చేసిన రానా చిత్ర యూనిట్ కి  అభినందనలు తెలియజేశారు. ఇక ఈ మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రాబోతోంది అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
 
మిస్ఱర్ సెలెబ్రిటీ ట్రైలర్‌‌లో హీరో యాక్షన్, వినోద్ ఆర్ఆర్, శివకుమార్ కెమెరా వర్క్ హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక విలన్ ఎవరన్నది చూపించుకుండా ట్రైలర్‌ను కట్ చేసిన విధానం దర్శకుని ప్రతిభను కనబరుస్తుంది. ఆ పాయింట్‌తో సినిమా మీద అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అక్టోబర్ 4న భారీ ఎత్తున ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.
 
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు