శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (18:05 IST)

నా సినిమా ఆగిపోలేదు... ప్రకటించిన టాలీవుడ్ హీరో

"లీడర్" సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రానా ఆ తర్వాత కాలంలో చాలా వైవిధ్యమైన కథనాలు గల సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 'బాహుబలి'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రానా బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసాడు. ఆయన నటించిన 'నేనే రాజు నేనే మంత్రి', 'ఘాజీ' సినిమాలలో చేసిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. 
 
వేణు ఊడగల దర్శకుడిగా తెరకెక్కించనున్న సినిమాలో హీరోగా రానా నటిస్తున్నట్లు, దానికి "విరాటపర్వం 1992" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆగిపోయినట్లు రూమర్స్ వ్యాపిస్తున్న తరుణంలో రానా దీనిపై స్పందించారు.
 
ఈ సినిమా ఆగిపోలేదని, సాయి పల్లవి హీరోయిన్‌గా, నేను హీరోగా ఈ సినిమాలో నటించబోతున్నామంటూ స్పష్టం చేసారు. ఈ సినిమాలో రానా వార్డ్ మెంబర్ పాత్రలో నటించనున్నారట. "నీదీ నాది ఒకే కథ" సినిమాతో వేణు ఊడుగుల ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా విభిన్న కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.