మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:53 IST)

సాయిపల్లవి నక్సలైట్.. రానా పోలీస్.. సెట్టవుతుందా?

సాయిపల్లవి ప్రస్తుతం సినిమాలతో బిజీబిజీ అవుతోంది. తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకుల మదిని దోచిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో మారి2లో నటించింది. తాజాగా రానాతో సాయిపల్లవి నటించనుందని టాక్ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సాయిపల్లవితో సినిమాపై రానా స్పందించారు. ణు ఊడుగుల దర్శకత్వంలో తన సినిమా వున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమా ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు. సాయిపల్లవి ఈ చిత్రంలో తనకు జోడీగా నటించనుందని తెలిపాడు. 
 
ఈ సినిమాలో తను సాయిపల్లవి కలిసి నటించనున్నామనీ, ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని రానా వెల్లడించాడు.  ఇకపోతే, ఈ సినిమాకు విరాట పర్వం 1992 అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. ఇక ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్‌గా, సాయిపల్లవి నక్సలైట్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.