గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (13:49 IST)

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి... స్పందించిన కత్రినా కైఫ్

Alia Bhatt
Alia Bhatt
బాలీవుడ్ స్టార్స్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. 
 
ఇన్స్‌స్టాగ్రామ్‌లో అలియా భట్ పోస్ట్ చేసిన పెళ్లి ఫొటోపై స్పందిస్తూ, 'ఇద్దరికీ శుభాకాంక్షలు. ఇద్దరూ అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలి' అని తెలిపింది. 
Alia_Ranbir
Alia_Ranbir
 
కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ ఇద్దరూ దాదాపు 6 ఆరేళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ దూరమయ్యారు. అనంతరం గత డిసెంబర్‌లో హీరో విక్కీ విశాల్‌ను కత్రిన పెళ్లాడింది. ఇప్పుడు అలియాను రణబీర్ వివాహం చేసుకున్నాడు. 
Alia_Ranbir
Alia_Ranbir
 
ఇదిలా ఉంటే..  అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం ముంబైలో వేడుకగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.