1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 మే 2022 (19:48 IST)

యశ్, రాధిక పండిట్ నటించిన రారాజు తెలుగులో విడుద‌ల కాబోతోంది

Yash, Radhika Pandit
Yash, Radhika Pandit
పాన్ ఇండియా స్టార్, రాక్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు.కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను మెగా డైరెక్టర్ వి వి వినాయక్ విడుదల చేసారు
 
ఈ సందర్భంగా డైరెక్టర్ వి వి వినాయక్ గారు మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గత 25 సంవత్సరాలనుంచీ ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. నాకు బాగా కావాల్సిన వ్యకి. ఇప్పుడు  కొత్తగా ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. యష్ .. కే జీ ఎఫ్ సినిమా కు ముందు నటించిన సినిమాని తెలుగులో  రారాజు పేరుతో పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో జూన్ లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. మరిన్ని మంచి సినిమా లు పద్మావతి పిక్చర్స్ బ్యానర్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 
నిర్మాత: వి.ఎస్.సుబ్బారావు  మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన రారాజు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోజూన్ లో రిలీజ్ చేస్తున్నాము. మా ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగా డైరెక్టర్ వి వి వినాయక్ గారికి కృతజ్ఞతలు యశ్ అతని భార్య రాధిక పండిట్ ఇద్దరు కలిసిన నటించిన చిత్రం కన్నడ లో సూపర్ హిట్ అయినట్టు తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.
 
రాక్ స్టార్ యశ్ , హీరోయిన్ రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణం
 
పద్మావతి పిక్చర్స్  బ్యానర్
మ్యూజిక్ హరికృష్ణ
డీ ఓ పి.. ఆండ్రూ
నిర్మాత.. వి ఎస్. సుబ్బారావు
డైరెక్టర్ .  మహేష్ రావు