సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (14:08 IST)

ఓటీటీలో కేజీఎఫ్ ఛాప్టర్ 2.. రూ.199 చెల్లిస్తేనే.. షరతులు వర్తిస్తాయి

KGFChapter2Teaser
దేశవ్యాప్తంగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఏకంగా రూ. 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అమేజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంది ఇంకేంటి సినిమా చూసేద్దాం అనుకుంటే మాత్రం పొరపాటే.
 
అమెజాన్‌ ఇక్కడే యూజర్లకు ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. అదేంటంటే.. సాధారణంగా తీసుకున్న సబ్‌స్క్రిప్షన్‌తో కేజీఎఫ్‌ సినిమా చూడడం వీలు పడదు. ఇందు కోసం యూజర్లు ప్రత్యేకంగా ఎర్లీ యాక్సెస్‌ పేరిట అదనంగా రూ.199 చెల్లించాల్సి ఉంటుంది.
 
అంతేకాదు ఇది కేవలం 30 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఇక ఈ ట్విస్ట్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు. సినిమా చూడటం మొదలు పెట్టిన 48 గంటల్లోనే వ్యాలిడిటీ పూర్తయిపోతుంది. అంటే సినిమా చూడడం మొదలు పెడితే రెండు రోజుల్లో పూర్తిచేయాలన్నమాట.
 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడం, అమెజాన్‌ అత్యంత ఎక్కువ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడంతో ఈ విధానాన్ని అవలంబించింది.