సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 3 జూన్ 2017 (15:06 IST)

'రారండోయ్ వేడుకచూద్దాం' కలెక్షన్లు అదుర్స్.. చైతూకు గోల్డెన్ ఇయర్..?

'రారండోయ్ వేడుకచూద్దాం' సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం చైతూ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై మనం, సోగ్గాడే చిన్నినాయనా వంటి సూపర్ హిట్

'రారండోయ్ వేడుకచూద్దాం' సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం చైతూ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై మనం, సోగ్గాడే చిన్నినాయనా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కింగ్ నాగార్జున 'రారండోయ్ వేడుక చూద్దాం' సాధించిన సూపర్ హిట్‌తో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 
 
అలాగే ఈ ఏడాది అక్కినేని నాగచైతన్యకు బాగా కలిసొచ్చింది. ఆ మధ్య రిలీజ్ అయిన 'ప్రేమమ్' మంచి విజయం సాధించింది. ఇక రియల్ లైఫ్‌లో నచ్చిన ప్రేయసి సమంతను ఈ ఏడాది చైతూ వివాహం చేసుకోబోతున్నాడు. తాజాగా రిలీజైన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ.20కోట్లు షేర్ సాధించింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.