ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (16:29 IST)

'చిరు'ను ఆటపట్టించిన ఆ ముగ్గురు హీరోయిన్లు.. జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి...

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల అగ్రహీరోగా కొనసాగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ హీరోను ముగ్గురు హీరోయిన్లు తెగ ఆటపట్టించారట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల అగ్రహీరోగా కొనసాగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ హీరోను ముగ్గురు హీరోయిన్లు తెగ ఆటపట్టించారట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల గురించి ఏదేని చిన్న వార్త వస్తే మెగా అభిమానులు దానిపై ఆరా తీస్తుంటారు. అలాంటిది చిరంజీవిపై వస్తే ఊరుకుంటారా? ఏంటి?. 
 
తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతున్న ఫోటో కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ముగ్గురు హీరోయిన్లు 'చిరు'ను ఆటపట్టిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. 'సుమలత'.. 'జయసుధ'.. 'సుహాసిని' ముగ్గురూ 'చిరు'తో దిగిన అప్పటి ఫొటో అది. 'జయసుధ' తన ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో పోస్టు చేశారు. 'జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి.. మేము తిరిగి వెనక్కి వెళ్లాలని కోరుకుంటున్నా' అంటూ పోస్టింగ్‌లో 'జయ' రాసుకొచ్చారు.