శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (18:35 IST)

రాజకీయాల్లోకి వస్తా.. ప్రజలకు ఎలా సాయం చేయాలో తెలుసు: రాశీఖన్నా

తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన రాశీఖన్నా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది.

రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని చెప్పింది. 
 
రాజకీయం ఎలా చేయాలో తనకు తెలియదు, కానీ ప్రజలకు ఎలా సాయం చేయాలో మాత్రం తనకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఐఏఎస్ అధికారి కావాలని ఉండేది. కానీ నటిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది.
 
భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తానని... అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తానని చెప్పింది. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటానని. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది.