శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 18 ఆగస్టు 2017 (15:07 IST)

తిరుపతిలో రాశీ ఖన్నాను ఆడుకున్న అభిమానులు...(వీడియో)

తిరుపతిలో సినీ నటి రాశీఖన్నా సందడి చేశారు. ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న మొబైల్ షాప్‌ను ప్రారంభించారు రాశీ ఖన్నా. రాశీ ఖన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. మొబైల్ షాప్ ముందుకు రాశీ ఖన్నా కారులో చేరుకోగానే

తిరుపతిలో సినీ నటి రాశీఖన్నా సందడి చేశారు. ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న మొబైల్ షాప్‌ను ప్రారంభించారు రాశీ ఖన్నా. రాశీ ఖన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు.
 
మొబైల్ షాప్ ముందుకు రాశీ ఖన్నా కారులో చేరుకోగానే రాశీ... రాశీ... అంటూ అభిమానులు కేకలు వేశారు. బాడీగార్డ్స్ ఉన్నా కూడా వారిని తోసుకుని రాశీ ఖన్నాతో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. అభిమాన నటితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అభిమానుల అత్యుత్సాహంతో రాశీ ఖన్నా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మొబైల్ షోరూంలోకి వెళ్ళి కాసేపు మాత్రమే ఉన్న సినీ నటి ఆ తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు.