అభిమాని కోరిక.. కాదనకుండా నెరవేర్చిన రష్మీ గౌతమ్
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే రష్మీ గౌతమ్.. అభిమానులతో టచ్‌లో వుంటుంది. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వుంటుంది. అలాగే తనతో ఎక్స్ ట్రాలు చేస్తే అక్కడే తోకలు కూడా కట్ చేస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్. ఇక ఇప్పుడు కూడా ఓ అభిమాని తనను అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.
అసలేం జరిగిందంటే ఈ మధ్యే ఓ అభిమాని రష్మీని వింత కోరిక కోరాడు. ఈ రోజు నా పుట్టినరోజు.. మీరు విష్ చేయాలని కోరుకుంటున్నాను.. అది కూడా నా పేరు పెట్టి.. అలా మీరు విష్ చేయకపోతే నా జీవితంలో ఈ పుట్టినరోజు వేస్ట్ అయిపోతుందంటూ కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చాడు ఆ ఫ్యాన్. దానికి రష్మీ కూడా పాజిటివ్‌గానే స్పందించింది. హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేసింది.
కాకపోతే పేరు లేకుండా విష్ చేసింది ఈ బ్యూటీ. అయినా కూడా ఆయన వెంటనే థ్యాంక్యూ మేడమ్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఛాటింగ్ చూసి మిగిలిన ఫ్యాన్స్ కూడా రష్మీ మంచి మనసుకు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.