శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (13:16 IST)

దడపుట్టిస్తున్న రష్మి గౌతమ్ "శివరంజని" ట్రైలర్

బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శివరంజని. నాగ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే గుండెల్లో దడ పుడుతోంది. "ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది. కానీ, చంపింది నేను కాదు నువ్వు" ఓ పోలీసు అధికారి నటుడు నందుతో చెబుతున్న డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
 
"నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి" అన్న రష్మి డైలాగ్‌తో పాటు "అది నీడ కాదు ఆత్మ" అంటూ మరో ఆర్టిస్ట్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. ఈ ట్రైలర్‌లో కమెడియన్ ధన్‌రాజ్ కూడా కనబడతాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.