గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (12:14 IST)

కేజీఎఫ్-2లో తెలుగు నటుడికి చోటు.. ఎవరాతను?

గతేడాది రిలీజైన కేజీఎఫ్ చిత్రం ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం సీక్వెల్ కేజీఎఫ్-2గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ నాటికి అన్ని పనుల్ని పూర్తి చేసుకుంటుంది. ఇందులో తెలుగు నటుడు రావురమేష్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 
 
అయితే ఆ పాత్ర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్ర రెండవ భాగం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సెకండ్ పార్టీ ఇంకా హెవీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని, వరల్డ్ మాఫియాను భారీ స్థాయిలో చూపించడం జరుగుతుందని అన్నారు. మొదటి భాగం భారీ హిట్‌ అవ్వడం వల్ల రెండవ భాగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కళ్ళు చెదిరే స్థాయిలో జరిగినట్టు సమాచారం.