శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 10 మే 2019 (15:35 IST)

పాట పాడుతానంటే, రా... రాత్రంతా నాతో పడుకో అన్నాడు... సింగర్ ప్రణవి

సింగర్ ప్రణవి. ఈమె ముఖం పెద్దగా పరిచయం లేకపోయినా గాత్రం మాత్రం బాగా గుర్తుపడతారు. యమదొంగ, శ్రీరామదాసు, జెంటిల్ మేన్, ఒక మనసు, పెళ్ళిచూపులు సినిమాల్లో హిట్ సాంగ్స్ పాడారు ప్రణవి. తను సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చినప్పుడు ఎదురైన సమస్యలను బాధపడుతూ చెప్పుకొచ్చారు.
 
శ్రీరెడ్డి లాంటి నటి రోడ్డుపైకి వచ్చి తన సమస్యలను చెప్పుకొంది సంతోషమే. ఆ తరువాత ఎంతోమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ బాధను బయటకు చెప్పుకుంటున్నారు. నాది కూడా అలాంటి బాధే. నేను పాటలు పాడటానికి వచ్చాను. సినిమాలో అవకాశమివ్వాలని ఒక దర్శకుడిని కోరాను. అయితే ఆయన మాత్రం నిర్మొహమాటంగా ఒకరోజు రాత్రంతా నాతో గడుపు నీకు అవకాశమిస్తాను. అంతేకాదు నా అన్ని సినిమాల్లోను నిన్నే పాడేటట్లు చేస్తాను అని చెప్పాడు.
 
నీ వయస్సెంత.. నా వయస్సెంత.. చెప్పు తెగుద్దు... అంటూ అక్కడి నుంచి వచ్చేశాను అని బాధ పడుతూ చెబుతోంది ప్రణవి. నన్ను ఆ దర్శకుడు ఇప్పుడు చూసిన తరువాత కూడా తలవంచుకుని ఉండిపోతాడు. అది చాలు నాకు. కానీ నాలా ఎవరూ వెనక్కి తగ్డొద్దండి.. ఎవరైనా సరే చెప్పులతో సమాధానం చెప్పండి అంటోంది ప్రణవి.