శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 27 జనవరి 2019 (20:58 IST)

డిస్కో రాజాగా రాబోతున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప‌ట్స్ ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. 
 
ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే తో పాటు ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుద‌ల చేశారు.