శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:26 IST)

తెలుగు, తమిళ బాషల్లో అవకాశాలురాని హాట్ హీరోయిన్.. ఎవరు?

రెజీనా క‌సాండ్రా... ఈమె గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీపరిశ్రమలో పాత, కొత్త హీరోలతో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్‌లు కూడా అయ్యాయి.

రెజీనా క‌సాండ్రా... ఈమె గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీపరిశ్రమలో పాత, కొత్త హీరోలతో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్‌లు కూడా అయ్యాయి. కానీ అవకాశాలు మాత్రం బాగా తగ్గిపోతున్నాయి. రీసెంట్‌గా రెజీనా నటించిన 'అ' సినిమా కూడా అంతగా ఆడకపోవడంతో ఇక రెజీనాకు తెలుగులో అవకాశాలు కనుమరుగయ్యే అవకాశం ఏర్పడింది.
 
ఇక తమిళంలో అంటారా, అప్పుడెప్పుడో రెండు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అందుకే ఇక చేసేది లేక రెజీనా హిందీ చిత్రపరిశ్రమపై దృష్టిసారించింది. అదేసమయంలో అవకాశాల కోసం తనకు తెలిసిన డైరెక్టర్లను కాకాపడుతోందట. ఇప్పటికే రెజీనాకు "అంఖేయిన్ 2" హిందీ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లకముందే ఆగిపోయింది.
 
ఇప్పుడు మరో అవకాశంతో రెజీనా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 'ఏక్ లడికీకో దేఖాతో ఐసాలగా' అనే సినిమాలో రెజీనాకు అవకాశం లభించింది. ఈ చిత్రంతో అయినా హిందీ సినీపరిశ్రమలోనే ఎలాగోలా నిలదొక్కుకోవాలన్న రెజీనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే ఇక తెలుగు, తమిళ సినిమాల్లో రెజీనా కనపడక పోవచ్చునంటున్నారు ఆమె స్నేహితులు.