బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (15:05 IST)

హైపర్ ఆదికి అలా జబర్దస్త్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది

''జబర్దస్త్'' కార్యక్రమంలో పాల్గొనే నటులకు సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు యాంకరింగ్ చేయడం ద్వారా సినీ ఛాన్సులను అనసూయ, రష్మీ కైవసం చేసుకుంటున్నారు. ఇక జబర్దస్త్ నట

''జబర్దస్త్'' కార్యక్రమంలో పాల్గొనే నటులకు సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు యాంకరింగ్ చేయడం ద్వారా సినీ ఛాన్సులను అనసూయ, రష్మీ కైవసం చేసుకుంటున్నారు. ఇక జబర్దస్త్ నటులు కూడా సినిమాల్లో హాస్యనటులుగా, విలన్‌గా మంచి పేరు కొట్టేస్తున్నారు. తాజాగా హైపర్ ఆది.. తనకు జబర్దస్త్‌లో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు.
 
కాలేజీ రోజుల నుంచే స్టేజ్ షోలు చేసే వాడినని తెలిపాడు. ఒకే చోటున కూర్చుని పనిచేయడం తనకు ఇష్టం వుండదు. ఒకసారి ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి ఫేస్ బుక్‌లో పెడితే 'అదిరే అభి' కామెంట్ చేశాడు. అబి పిలుపు మేరకే తనకు జబర్దస్త్ అవకాశం వచ్చిందన్నాడు.
 
అంతేగాకుండా తాను బీటెక్ చదువుతున్నప్పటి నుంచి జబర్దస్త్ చూసేవాడినని.. స్టేజ్ షోపై పంచ్‌లేస్తే ప్రేక్షకులు తెగ నవ్వుకునేవారు. అందుకే స్టేజ్‌పై అడుగుపెట్టే అవకాశం తనకు వచ్చాక, డ్రామా ఎక్కువగా చేయకుండా, ప్రేక్షకులు ఎదురుచూసే పంచ్‌లతోనే మొత్తం ఎపిసోడ్ నడిపించాలని నిర్ణయించుకున్నాను. అందుకే జబర్దస్త్‌లో పంచ్‌లు పేలుతుంటాయని హైపర్ ఆది తెలిపాడు.