శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:37 IST)

జబర్దస్త్ హాస్యంపై విరుచుకుపడ్డ రాజేంద్రప్రసాద్

కామెడీ అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. జంధ్యాల, రేలంగి నరసింహారావు, బాపు, సింగీతం శ్రీనివాసరావు వీరందరూ మా దగ్గర చేయించింది నిజమైన కామెడీ. కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా కూర్చుని హాయిగా నవ్వుకుని చూసే కామెడీనే నిజమైన కామెడీ అంటారు. ఇప్పటికీ నేను నటించిన సి

కామెడీ అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. జంధ్యాల, రేలంగి నరసింహారావు, బాపు, సింగీతం శ్రీనివాసరావు వీరందరూ మా దగ్గర చేయించింది నిజమైన కామెడీ. కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా కూర్చుని హాయిగా నవ్వుకుని చూసే కామెడీనే నిజమైన కామెడీ అంటారు. ఇప్పటికీ నేను నటించిన సినిమాలను కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని నవ్వుతూ చూస్తుంటారు. అది చాలు నాకు. ట్రెండ్ మారుతోందని కామెడీని ఎబ్బెట్టుగా చూపించడం మంచిది కాదు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇదంతా చెప్పింది మరెవరో కాదు సినీ నటుడు రాజేంద్రప్రసాద్. 
 
జబర్దస్త్ షోలో ఈ మధ్య వల్గర్‌గా డైలాగ్‌లు ఉండటం, జుగుప్సాకరంగా ఆ డైలాగ్‌లు ఉండటంపైనా రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాల్లో మార్పు రావాలి. నేను మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. చిన్న పిల్లాడు కూడా అలాంటి వల్గర్ డైలాగ్‌లను గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం అధిగమించాలి. అలాంటి కార్యక్రమాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్.