శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 28 నవంబరు 2017 (19:13 IST)

కొత్త వివాదంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు...

జబర్దస్త్ షో ప్రస్తుతం వివాదాల మధ్య నడుస్తోంది. జబర్దస్త్‌లో మహిళలు, హిజ్రాలు, అనాధల గురించి ఇష్టమొచ్చినట్లు పంచ్‌లు వేస్తున్నారని కొన్ని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వల్గర్ కామెడీకి వివిధ వర్గాలు, మహిళలు, అనాధలు కించపరిచేందుకే వేదికగా జబర్దస్త్ మార

జబర్దస్త్ షో ప్రస్తుతం వివాదాల మధ్య నడుస్తోంది. జబర్దస్త్‌లో మహిళలు, హిజ్రాలు, అనాధల గురించి ఇష్టమొచ్చినట్లు పంచ్‌లు వేస్తున్నారని కొన్ని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వల్గర్ కామెడీకి వివిధ వర్గాలు, మహిళలు, అనాధలు కించపరిచేందుకే వేదికగా జబర్దస్త్ మారిందని అటు హెచ్ఎంసిలోను ఇటు సైబరాబాద్ పోలీస్టేషన్‌లోను ఫిర్యాదులు చేశారు. దీనిపై ఇప్పటికే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. హైపర్ ఆదిపై ప్రజా సంఘాలన్నీ మండిపడుతున్నాయి. అయితే దీనిపై నాగబాబు వివరణ కోరేందుకు కొన్ని ప్రజాసంఘాలు ప్రయత్నించారు. 
 
దీంతో నాగబాబు ఫోన్లో ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. మీడియా, మహిళా, ప్రజా సంఘాలు మీరెవరు ఉద్దరించడానికి అని ప్రశ్నించారు. ఇలాంటివారు చేసే ఆరోపణలకు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది బూతు, ఏది కామెడీ అన్న విషయాన్ని నిర్ధారించాల్సింది సంఘాలు కాదు.. ప్రేక్షకులు మాత్రమేనన్నారు నాగబాబు. దీనిపై పదేపదే మాట్లాడవద్దని ఫోన్ కూడా పెట్టేశారు. ప్రజా సంఘాల నేతలు నాగబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.