మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (12:44 IST)

కృష్ణవంశీ నక్షత్రంలో రెజీనా.. టూ పీస్ అందాల మత్తెక్కిస్తుందట!

చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను కృష్ణవంశీ తన లేటెస్ట్ సినిమా నక్షత్రంలో అవకాశం కల్పించాడని వార్తలొచ్చిన నేపథ్యంలో తాజాగా రెజీనా లైన్లోకి వచ్చింది. సందీప్ కిషన్‌తో నటించిన రారా కృష్ణయ్య సినిమాలో అందాలను ఆరబోసి.. ఆపై లిప్ లాక్‌లతో రెజీనా రెచ్చిపోయింది. ఆ తర్వాత పవర్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య వంటి చిత్రాల్లో నటించింది.
 
కానీ హిట్‌కు మాత్రం నోచుకోని రెజీనా కృష్ణవంశీ సినిమాలో నటించే ఛాన్సును దక్కించుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రెమ్యునరేషన్‌తో పనిలేదని ఆఫర్ ఇవ్వడంతో రెజీనాను సెలక్ట్ చేసుకునేందుకు కృష్ణవంశీ సుముఖత వ్యక్తం చేశాడని.. తద్వారా రెజీనాకు మంచి హిట్ ఇవ్వాలనుకుంటున్నాడు. నక్షత్రం సినిమా రెజీనా సినిమాకు టర్నింగ్ పాయింట్ కావాలనుకుంటున్నాడు.
 
అంతేకాదు.. రెజీనాను అందంగా చూపెట్టడంతో పాటు ఆమెను బికినీలో కనిపించేలా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. టూ పీస్ బికినీలో మత్తెక్కించేందుకు రెజీనా రెడీ అయ్యిందని.. తద్వారా మరిన్ని అవకాశాలను కైవసం చేసుకోవచ్చునని భావిస్తోంది.