సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (12:01 IST)

మళ్లీ సహజీవనం చేయను... లవ్ మ్యారేజ్ కాదు: రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో వ్యక్తిని ఈమె పెళ్లాడనుంది. ఈ వివాహం ప్రేమ వివాహమా లేక పెద్దల కుదిర్చిన పెళ్లా అనే విషయంపై నెటిజన్లలో ఆసక్తికర చర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో వ్యక్తిని ఈమె పెళ్లాడనుంది. ఈ వివాహం ప్రేమ వివాహమా లేక పెద్దల కుదిర్చిన పెళ్లా అనే విషయంపై నెటిజన్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో తన రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ స్పందించింది.
 
'ఇది పూర్తిగా స‌న్నిహితులు కుదిర్చిన పెళ్లి. చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అంత ఆతృత‌ మాత్రం లేదు. ప్రేమ అనేది జీవితంలో ఒక‌సారే క‌లుగుతుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌డం జ‌ర‌గ‌దు. గ‌త ఏడేళ్లుగా నేను ఒంటరిగానే ఉన్నాను. 
 
అప్పుడూ సంతోషంగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నా నేను అంతే సౌక‌ర్యంగా ఉండ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఆయ‌న చాలా ప్ర‌శాంత‌మైన వ్య‌క్తి. మ‌ళ్లీ స‌హ‌జీవ‌నం చేయాల‌ని నేను అనుకోలేదు. అందుకే సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నా'నని రేణు చెప్పుకొచ్చారు.