గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (13:49 IST)

అమృతా రావుకు బాబు పుట్టాడు.. ఓ పేరు పెట్టండి చూద్దాం...

Amrita Rao
తెలుగులో అతిథి, శౌర్యం వంటి చిత్రాలలో నటించిన అమృతా రావు ఏడేళ్ళ పాటు ప్రముఖ ఆర్జే ఆన్మోల్‌తో ప్రేమాయణం సాగించింది. 2016లో వీరిరివురు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించాడు. సోమవారం రోజు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే తమ కుమారుడికి మంచి పేరు సూచించాలని అమృతా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోరింది.
 
ఏడేళ్ళ పాటు ప్రేమ, నాలుగేళ్ళ పాటు వైవాహిక జీవితం. మొత్తం 11 ఏళ్ళ రిలేషన్ షిప్. ఎంతో ఆనందంగా సాగింది. ఇటీవల కుమారుడు కూడా జన్మించాడు. జీవితం ఆనందంగా సాగుతుంది. మా కుమారుడికి మంచి పేర్లు సూచించండి అంటూ అమృతా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోరింది. అమృత పండంటి కొడుకుకి జన్మనివ్వడంతో ఆమెకు అభిమానులు, శ్రేయోభిలాషులు, పలువురు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.