సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (19:28 IST)

పుత్రోత్సాహంలో హార్దిక్ పాండ్యా.. ఫోటో వైరల్.. లైకుల వెల్లువ

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన కుమారుడి ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనవరిలో నటాషా, హార్దిక్ పాండ్యాల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 
 
కానీ పెళ్లికి ముందే సహజీవనంతో ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ఈ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా పుత్రోత్సాహంలో పొంగిపోతున్నాడు. అతని భార్య నటాషా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం నాడు తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హార్దిక్ ప్రకటించాడు. 
 
చిన్నారి చేతిని తాను పట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు. ముఖం మాత్రం చూపించలేదు. తాజాగా శనివారం తన కుమారుడిని అందరికీ చూపించాడు. కొడుకుని ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటోను షేర్ చేశాడు. 
 
డెలివరీ రూమ్‌లో ఈ ఫొటోను తీసినట్టు కనిపిస్తోంది. కొడుకుని చూసిన ఆనందంలో హార్ధిక్ ముఖం వెలిగిపోతోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫొటోను షేర్ చేసిన గంటల వ్యవధిలోనే 24 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. 
Hardik pandya