శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (13:00 IST)

గాలిలో కరోనా వైరస్ వస్తుందనీ... ఇంటిని ప్లాస్టిక్ కవర్లతో కప్పేసిన బాలీవుడ్ హీరో!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ గురించి మరో నిజాన్ని ఇటీవల కొందరు వ్యక్తం చేశారు. అదేంటంటే.. గాలిద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందన్నది ఆ సమాచారం. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం అలాంటి ఆధారాలేమీ లేవని అంటోంది. 
 
ఈ క్రమంలో కరోనా వైరస్ బారినపడకుండా ఉండేదుకు బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు వివిధ రకా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా తీవ్ర రూపం దాలుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్ర‌మంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మ‌న్న‌త్ బంగ్లా మొత్తాన్ని ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. గాలి ద్వారాను వైర‌స్ వ్యాపిస్తుంద‌నే ప్ర‌చారం ఉన్న నేప‌థ్యంలో షారూఖ్ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని అంటున్నారు. మ‌న్న‌త్‌లో షారూఖ్ త‌న భార్య గౌరీఖాన్‌తో పాటు ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటున్నారు.
 
కాగా, కరోనా కష్టకాలంలో షారూఖ్ ఖాన్ తన పెద్ద మనసును చాటుకున్న విషయం తెల్సిందే. త‌న ఆఫీసుని కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం ఇచ్చాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా నిలిచాడు. నిత్యావ‌స‌రాలు కూడా అందించారు. 
 
మరోవైపు, "జీరో" మూవీ తర్వాత మ‌రో సినిమాకి పచ్చజెండా ఊపని షారూఖ్ ఖాన్ ప్ర‌స్తుతం క‌థ‌ల‌ని వింటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 20కి పైగా క‌థ‌లు విన్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే త‌న త‌ర్వాతి సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడ‌ని అంటున్నారు.