గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (18:56 IST)

వైజయంతీ మూవీస్ లో రోషన్ చిత్రం టైటిల్ ఛాంపియన్

Roshan newlook
Roshan newlook
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ తమ ప్రొడక్షన్ నంబర్ 9 గా యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి అశ్వనీదత్ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
 
రోషన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ సినిమాలో అతని లుక్‌ను రివీల్ చేయడంతో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఛాంపియన్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. రోషన్ పోస్టర్‌లో పొడవాటి జుట్టు, లైట్ గడ్డంతో చాలా అందంగా కనిపిస్తున్నాడు. టైటిల్ లోగోపై రెండు వైపులా రెక్కలతో ఫుట్‌బాల్ ఉంది.
 
‘పెళ్లి సందడి’ సినిమాతో అందరినీ మెప్పించిన రోహన్ ఛాంపియన్‌లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా సినిమా కోసం రోషన్ కోవర్ అయ్యారని పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది.  
 
ప్రదీప్ అద్వైతం రోషన్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి విన్నింగ్ స్క్రిప్ట్‌ను రాశారు. ఈ చిత్రంలో  ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్ కాగా, మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వివరాలు  తెలియాల్సివుంది.v