మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (11:58 IST)

రామ్ పోతినేనికి రాజమండ్రిలో అభిమానుల ఘన స్వాగతం

Fans grand welcome to Ram
Fans grand welcome to Ram
రాజమండ్రిలో రామ్ పోతినేనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గోదావరి జిల్లాలలో సంప్రదాయం ప్రతిబింబించేలా అరటి పళ్ళతో చేసిన భారీ దండతో వెల్కమ్ చెప్పారు. RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్తే... ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇప్పటివరకు ఏ హీరోకి ఇటువంటి ఘన స్వాగతం రాజమండ్రిలో దక్కలేదు. అరటిపళ్ల దండ అందుకున్న మొదటి హీరో రామ్.
 
మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్న‌ చిత్రమిది. లేటెస్ట్ షెడ్యూల్ సోమవారం రాజమండ్రిలో ప్రారంభం అవుతుంది. దీనికోసం సుమారు 15 ఏళ్ల తర్వాత గోదావరి జిల్లాలలో అడుగుపెట్టారు రామ్. ఇంతకుముందు 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమా చిత్రీకరణ గోదావరి జిల్లాలలో చేశారు. అప్పటికి ఇప్పటికీ గోదావరి ప్రజలలో రామ్ మీద అభిమానం బాగా పెరిగింది. ఈ సినిమాలో రామ్ పోతినేని జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు.