ఫైనల్‌గా ఆర్.ఆర్.ఆర్.. సీక్రెట్ రాజమౌళి చెప్పేశాడు
ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన దేశాలు తిరుగుతున్నాడు. ఎక్కడా కూడా ఈ సినిమాకూ స్పూర్తి ఏమిటదనేది వెల్లడించలేదు. ఆయన చాలా విదేశీ సినిమాలు చూసి అందులోని ఒక్కో సినిమాలో ఒక్కో యాక్షన్ సీన్‌ను కాపీ చేసేస్తుంటాడు. అది తెలుగులో ఎమోషన్స్‌ను పండిచేట్లుగా చేస్తాడు. శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఎక్స్‌పోలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజమౌళి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకతప్పలేదు. ఆ వివరాలు..
- బాహుబలి తర్వాత ఇద్దరు హీరోలతో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఇద్దరూ స్నేహితులయితే ఎలా వుంటుందనేది నాకు మెదిలింది. బాహుబలిలో ఇద్దరు దాయాదులు. కానీ ఇక్కడ ఇద్దరు స్నేహితులు. దీనిని ఎలా మలచాలనుకుంటుండగా `మోటార్ సైకిల్ డైరీస్` అనే స్పానిష్ సినిమా చూశాక ఆర్.ఆర్.ఆర్.కు బీజం పడిందని రాజమౌళి చెప్పేశారు.
- అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లనే ఎందుకు తీసుకున్నారనేందుకు ఆయన సమాధానమిస్తూ, ఇద్దరి జీవితాల్లో చాలా సంఘటనలు ఒకేలా వున్నాయి. ఇద్దరూ నాలుగేళ్ళు ఇంటినుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. తిరిగి వచ్చాక ఇద్దరూ బ్రిటీష్‌వారిపై పోరాడారు. అలాగే జీవితంలో మరికొన్ని సంఘటనలు ఒకేలా అనిపించాయి .అందుకే ఆ ఇద్దరి కథను ఫిక్షన్‌గా మలిచాను అన్నారు.
- నేను తెలుగు సినిమా తీసినా, ఎమోషన్స్‌కు బాగా చూపిస్తాను. వాటికి ప్రపంచంలో ఎవరైనా కనెక్ట్ అవుతారు. అందుకే వారికి అర్థమయ్యేలా సబ్ టైటిల్స్ వేస్తాను. ఈగ సినిమాను అలా వేయకపోవడంతో విదేశీయులకు అర్థంకాలేదు. అందుకే ఈ జాగ్రత్త తీసుకున్నానని చెప్పారు.