ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (15:53 IST)

రుద్ర సింహ టైటిల్ పోస్టర్ ఆవిష్క‌రించిన స‌ముద్ర‌

V. Samudra, Santosh. Sneha, Maitri, Manohar Katepogu and others
V. Samudra, Santosh. Sneha, Maitri, Manohar Katepogu and others
సంతోష్. స్నేహ, మైత్రి, హీరో, హీరోయిన్లు గా న‌టిస్తున్న చిత్రం  రుద్ర సింహ. మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న యాక్షన్, రీవేంజ్ డ్రామా చిత్రం.  ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ చిత్ర పోస్టర్‌ను  ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు వి.సముద్ర "రుద్ర సింహ" మూవీ మొదటి పోస్టర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు దొరై రాజు,దాసన్న,నటుడు చలపతి రాజు తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం
 
అనంత‌రం సముద్ర మాట్లాడుతూ..  ఈ చిత్ర నిర్మాతలు ధరగయ్య, ఆంజనేయులు, కోటేశ్వర్ రావులు నాకు మంచి మిత్రులు.ఇక ముందు ఈ బ్యానర్ లో పెద్ద పెద్ద సినిమాలు నిర్మించి ఒక రామానాయుడు, ఆర్.బి చౌదరి, ఏవియం  బ్యానర్స్ లా ఎదుగుతూ 100 సినిమాలు నిర్మించే బ్యానర్ లా  రూపుదిద్దు కోవాలని కోరుతున్నాను. దర్శకుడు మనోహర్ కు ఇది మొదటి చిత్రమైనా ఎంతో కష్టపడ్డాడు.ఈ సినిమాకు మాటలు, పాటలు,కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ ఇలా ఇన్ని బాధ్యతలు తీసుకొని "రుద్ర సింహ" సినిమాను డైరెక్షన్ చేయడం జరిగింది.శివుడు పేరుతో మొదలైన టైటిల్ బాలయ్య బాబు టైటిల్ లా ఉంది.మంచి నిర్మాతలు, దర్శకులు కలసి తెరకెక్కిస్తున్న "రుద్ర సింహ" సినిమా ద్వారా హీరో గా పరిచయ మవుతున్న సంతోష్ అదృష్ట వంతుడు. "రుద్ర సింహ" టీజర్, ట్రైలర్,పాటలను విడుదల చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
దర్శకుడు దొరై రాజు మాట్లాడుతూ..KM ఫిల్మ్ బ్యానర్ లో యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల తో  వస్తున్న "రుద్ర సింహ" సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.
నటుడు చలపతి రాజు మాట్లాడుతూ..సింహ అంటే బాల కృష్ణ గారి సినిమా గుర్తుకు వస్తుంది.అలాంటి సింహ కు రుద్ర ను జాయింట్ చేసి రుద్ర సింహ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.పేదవారికి కావాలి సినిమా ధనవంతు లకు కావాలి సినిమా ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
చిత్ర నిర్మాత ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి పోయే "సింహారాశి" వంటి ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి పోయే దర్శకుడు గా పేరు గాంచిన సముద్ర గారు మా చిత్ర పోస్టర్ ను విడుదల చేయడం అదృష్టంగా బావిస్తున్నాము. KM ఫిల్మ్ బ్యానర్ లో మేము తీసిన "రుద్ర సింహ" సినిమాను రాయలసీమ లోని అడవులలో చిత్రీకరించిన ఈ సినిమాను యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా తెరకెక్కించడం జరిగింది. దర్శకుడు మనోహర్ మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా లో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు ఇందులో ఏడు పాటలు, ఐదు ఫైట్స్ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు. 
 
మరో చిత్ర నిర్మాత కోటేశ్వర్ రావు లు మాట్లాడుతూ..ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు నిర్మించి గొప్ప దర్శకుడి గా పేరు తెచ్చుకున్న సముద్ర గారు మా చిత్ర పోస్టర్ ను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. లవ్ ,యాక్షన్, సెంటిమెంట్ తో కూడిన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర దర్శకుడు మనోహర్ మాట్లాడుతూ..సీనియర్ దర్శకులు సముద్ర గారి చేతుల మీదుగా నేను చేసిన సినిమా పోస్టర్ ను విడుదల జరుగుతుంది అని ఊహించలేదు. యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ కూడా కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఎంతో థ్రిల్ ఫీల్ అవుతారు.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా కుదిరారు. వారంతా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది అని అన్నారు.
 
చిత్ర హీరో సంతోష్ మాట్లాడుతూ.. మా చిత్ర పోస్టర్ ను విడుదల చేసిన దర్శకుడు సముద్ర గారికి ధన్యవాదాలు."రుద్ర సింహ" వంటి మంచి కాన్సెప్ట్ ఉన్న ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అని అన్నారు.