శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (12:28 IST)

టెర్నినేటర్‌ చిత్రం గురించి సీక్రెట్‌ చెప్పిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి

Rajamolu speech
Rajamolu speech
తెలుగులో గర్వించదగ్గ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఆలోచించే విధానం ఇప్పటిదికాదు. చిన్నతనంలోనే పదిమంది కోణంలో ఆలోచించేవాడట. చైల్డ్‌గా వున్నప్పుడు కథ చెప్పేటప్పుడు పెద్ద స్క్రీన్‌ ఊహించి చుట్టూ పదిమంది వుండేలా ఊహించుకునేవాడట. తన చిన్నతనం సంగతులను విదేశాల్లోని ప్రేక్షకులముందు వెల్లడించారు. తాజాగా ఆయనకు ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు సంబంధించిన ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్‌ సర్కిల్‌ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెట్‌లో సంప్రదాయమైన దుస్తులు దరించిన స్టేజీమీదకు వెళ్లారు. ఆయన పేరు నిర్వాహకులు ప్రకటించినగానే అక్కడివారంతా కరతాళ ధ్వనులు చేశారు.
 
అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సౌత్‌లో చిన్న పరిశ్రమ తెలుగు. ఒకప్పుడు ఇది వుందనేదికూడా ఇక్కడివారికి పెద్దగా తెలీదు. నేను చిన్నప్పటినుంచి ఏదైనా విజువల్‌గా భావించి చేస్తుంటాను. యంగ్‌లో వుండగా ‘టెర్నినేటర్‌2’ సినిమాను థియేటర్‌లో చూశాను. యాక్షన్‌ సీక్వెన్స్‌ సీరియస్‌గా, ఇంట్రెస్ట్‌గా సాగుతున్నాయి. షడెన్‌గా ఇంటర్‌ వెల్‌ వేశారు. థియేటర్‌ ఆపరేటర్‌ను అడిగితే, ప్రేక్షకుల్లో వున్న ఆ ఉత్సాహం ఆనందం చూడు అంటూ చెప్పాడు. నిజంగా అప్పుడు ప్రేక్షకులను చదవడం మొదలు పెట్టా. ఇది కదా కావాల్సింది అని నాకు అనిపించింది. తెలుగులో ఇలాంటి సినిమా ఎందుకు తీయడంలేదు అనే ఆలోచన కూడా అప్పుడే కలిగింది. అందుకే ఎప్పటికైనా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఎమోషన్స్‌తో కనెక్ట్‌ అయ్యేట్లుగా సినిమా చేయాలనుకున్నా. అలా చేస్తూనే వున్నాను. ఆర్‌.ఆర్‌.ఆర్‌.కి అది బాగా వర్కవుట్‌ అయింది. సౌత్‌లో ఎలా ఫీలయ్యారో అమెరికన్స్‌ కూడా అలా ఫీల్‌ కావడం జరిగింది అని తెలిపారు. టెర్మినేటర్‌ పేరు వినగానే ఆయనకు కరతాళ ధ్వనులతో అమెరికన్లు ప్రశంసలు అందించారు.