శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (17:57 IST)

ఆడతనమా చూడతరమా ఫస్ట్ లుక్ ఆవిష్క‌రించిన సాగర్ చంద్ర

Sagar chandra first look
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేస్తున్న ద‌ర్శ‌కుడు సాగర్ చంద్ర `ఆడతనమా చూడతరమా` ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మన్యం కృష్ణ, అవికా రావ్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి.
 
చిత్ర దర్శకుడు పండు మాట్లాడుతూ, అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. త్వరలో మా సినిమా ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నాము అన్నారు. 
 
నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ, డైరెక్టర్ పండు మంచి కాన్సెప్ట్ తో ఆడతనమా చూడతరమా సినిమాను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది, పాటల మినహ చిత్రీకరణ పూర్తి అయ్యింది. మా దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోన్న మొదటి సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సాగర్ చంద్ర గారికి ధన్యవాదాలు అన్నారు. 
 
ఇంకా ఈ సినిమాలో  సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు న‌టించారు. సంగీతం: సుక్కు సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి.