చేతిలో గోరింటాకు... సిగ్గుల మొగ్గ అయిన సాయిపల్లవి.. ఫోటోలు వైరల్
ఫిదా భామ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాల్లోనే కాదు.. ఆమె నవ్వుకు.. ప్రవర్తనకు.. మాట తీరుకు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే సాయిపల్లవి.. కేవలం డబ్బుల కోసం మాత్రమే ప్రాజెక్టులను అంగీకరించదు.
ముఖ్యంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒకే చెప్తుతుంది. అలాగే ఇప్పటికీ ఏలాంటి బ్యూటీ యాడ్స్‌లోనూ సాయి పల్లవి నటించలేదు. రెండు కోట్ల ఆఫర్ వచ్చినా కూడా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌కు సాయి పల్లవి నో చెప్పారు. అలా తన నిర్ణయాలతో సాయి పల్లవి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.
అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సాయిపల్లవి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తోపాటు.. ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
అందులో చేతికి.. కాళ్లకు గోరింటాకు డిజైన్స్ వేసుకున్నారు. సందర్భం ఏంటో చెప్పలేదు కానీ.. గోరింటాకును చూసి తెగ సిగ్గు పడిపోతున్నారు. సెల్ఫ్ లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ హైబ్రిడ్ పిల్ల.. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీ.. అటు రానాతో విరాట పర్వం మూవీ చేస్తుంది.