ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 మే 2023 (17:48 IST)

సాయిపల్లవి పుట్టిన రోజు.. అక్కగా దొరకడం లక్కీ.. సిస్టర్ స్వీట్ విష్

Saipallavi
Saipallavi
సాయిపల్లవి పుట్టిన రోజు నేడు. తాజాగా సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అక్కతో క్లోజ్‌గా ఉన్న ఫోటోను పూజ షేర్ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
"ఈ రోజు తనను మిస్ అవుతున్నానని.. నిన్ను గిచ్చడం, నీ మొహం ఎర్రగా అవ్వడం చూడలేకపోవడం కూడా మిస్ అవుతున్నా.. నీకు చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. అంటూ చెప్పుకొచ్చింది. "హ్యాపీ బర్త్ డే బెస్ట్ ఫ్రెండ్.. మనం కొన్ని మంచి, డీసెంట్ ఫోటోలను దిగాలి.. అంటూ" సాయిపల్లవి సిస్టర్ పూజా కన్నన్ పోస్ట్ వేసింది.
 
ఇక చెల్లి చూపించిన ప్రేమకు సాయి పల్లవి స్పందించింది. ఐ లవ్యూ అంటూ కామెంట్ పెట్టేసింది. సాయి పల్లవి ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. అందుకే ఇంట్లో లేనట్టుగా కనిపిస్తోంది. ఇక ఇంట్లో తన అక్క లేదని, బర్త్ డేను దగ్గరగా ఉండి సెలెబ్రేట్ చేసుకోలేకపోతోన్నామని సాయి పల్లవి చెల్లి బాధపడుతున్నట్టుగా ఉంది.