మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

విజయ్ దేవరకొండ - సమంతల ఖుషి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

khushimovie still
విజయ్ దేవరకొండ - సమంతలు జంటగా నటించిన తాజా చిత్రం "ఖుషి". ఈ ప్రేమ కథా చిత్రం నుంచి మొదటి పాటను మంగళవారం రిలీజ్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. దర్శకుడు శివ నిర్వాణ. "మజిలీ" చిత్రం తర్వాత శివ నిర్వాణతో సమంత నటించిన చిత్రం. వచ్చే సెప్టెంబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
"మహానటి" చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇపుడు పూర్తి స్థాయిలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక "మజలీ" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శివ నిర్వాణతో కలిసి సమంత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. "నా నువ్వ" అంటూ ఈ పాట సాగుతుంది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై తెరకెక్కింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబరు ఒకటో తేదీన ఈ చిత్రం విడుదల చేయనున్నారు. యూత్‌కి సినిమా ఎంతవరకు కెనెక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.