ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (10:18 IST)

సాలార్ ఇంటర్వెల్ సీన్-కాళీమాత ముందు ప్రభాస్ వార్

Prabhas
కేజీఎఫ్-2 బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సాలార్‌పై టాలీవుడ్, బాలీవుడ్, అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ సాలార్ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. 
 
శృతి హాసన్ కథానాయికగా రానున్న ఈ ఎంటర్‌టైనర్‌లో ప్రశాంత్ నీల్ మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్‌షిప్ అంశాలను టచ్ చేయబోతున్నట్లు తెలిసింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ మంచి బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల అంచనాలన్నీ సాలార్ సినిమాపైనే ఉన్నాయి.
 
ఇదిలా ఉంటే సాలార్ ఇంటర్వెల్ సీన్ స్టోరీ లీక్ అయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ సినిమా స్ఫూర్తితో ఆ సినిమాలోని ఓ సీన్‌ని సాలార్‌లో ఉపయోగించారనే టాక్‌ వినిపిస్తోంది. కేజీఎఫ్ సినిమా మొదటి భాగం క్లైమాక్స్‌లో రాకీ భాయ్ పెద్ద దేవత విగ్రహం ముందు గరుడుడి తలను నరికివేసే సన్నివేశం గుర్తుకు వస్తుంది.
 
ఆ సీన్ స్ఫూర్తితో ప్రశాంత్ నీల్ సాలార్‌లో కూడా అలాంటి సీన్ క్రియేట్ చేశాడు. సాలార్ ఇంటర్వెల్ సీన్‌లో కాళీమాత పెద్ద విగ్రహం ముందు ప్రభాస్ విలన్‌లతో పోరాడే సన్నివేశం ఉందని అంటున్నారు.