బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (19:00 IST)

నా ధైర్యం అక్కడే ఉంది అంటోన్న అక్కినేని సమంత

నేను తెలుగు, తమిళ సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరినే. కాదనడం లేదు. అయితే నేను ఎప్పుడూ రేసులో ముందుండాలి.. ముందుకెళ్ళాలి. అందరినీ మించిపోవాలి అనుకోవడం లేదు. ఎందుకంటే సమంత అంటే ఒక ప్రత్యేకత ఉంది. సినీ ప్రేక్షకులందరికీ ఒక నమ్మకం ఉంది. అది చాలు అంటోంది అక్కినేని సమంత.
 
ఇక నా అందం చూసో.. లేకుంటే నేను పడే కష్టం చూసో నాకు అవకాశాలు.. విజయాలు వస్తున్నాయని అనుకోవడం లేదు. నేను ఎంచుకునే కథను బట్టే నాకు విజయాలు, అవకాశాలు మళ్ళీమళ్ళీ వస్తున్నాయని నమ్ముతుంటాను. ఇది నిజమే. ఎందుకంటే నేను దర్సకుడు కథ చెప్పినప్పుడు బాగా ఆలోచిస్తాను.
 
ఈ క్యారెక్టర్లో నేను లీనమై చేయగలనా. ఈ క్యారెక్టర్లో నా పాత్రకు ఎన్ని మార్కులు వేయొచ్చు. నా క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారా. ఇలా రకరకాల ప్రశ్నలను నాపై నేను సంధించుకుంటా. అప్పుడే నేను ఆ సినిమాలో నటించాలా లేదా అన్నది నిర్ణయించుకుంటాం. ఇప్పటికీ నేను ఏ సినిమాలో నటించాలన్నా ఇలాగే చేస్తానంటోంది సమంత. ఓ బేబీ సినిమా అద్భుతంగా ఉంటుందని, తన క్యారెక్టర్ అందరినీ అలరిస్తుందని చెబుతోంది సమంత.