శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 28 మే 2019 (15:37 IST)

స‌మంత‌.. మ‌రోసారి పేరు మార్చుకుందా...? ఎందుకో తెలిస్తే షాకవుతారు

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి చిత్రంతోనే అంద‌ర్నీ ఆక‌ట్టుకుని శ‌భాష్ అనిపించుకుంది. అంతేనా... అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకుంది. సంచ‌ల‌నం సృష్టించింది అందాల స‌మంత‌. ఆమె అస‌లు పేరు స‌మంత రూత్ ప్ర‌భు. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ‌లో ప‌డ‌డం.. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకోవ‌డం తెలిసిందే. 
 
అయితే... వివాహానంతరం సమంత రూత్ ప్ర‌భు కాస్తా స‌మంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేకుంది. మళ్లీ ఇప్పుడు తన పేరును మార్చుకుంది. ఇంత‌కీ ఏమ‌ని మార్చుకుంది అంటారా..? సమంత అక్కినేని కాస్తా బేబి అక్కినేనిగా మారిపోయింది. పేరు మార్చుకోవడం ఇంత‌కీ దేని కోసం అంటారా..? స‌మంత‌ నటించిన తాజా చిత్రం ఓ బేబీ. 
 
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనికోసమే సామ్ తన పేరును మార్చుకుంది. తన పేరు మార్పు తన చిత్ర ప్రమోషన్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందని సామ్ ఆలోచన అనుకుంట‌ా. పేరునే కాదు తన సోషల్ మీడియా డీపీని కూడా మార్చేసింది. ఓ బేబీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను తన డిస్‌ప్లే పిక్‌గా మార్చేసుకుంది.
 
స‌మంత అంద‌రిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటుంది. అలాగే ప్ర‌మోష‌న్స్‌ను కొత్త‌గా.. వినూత్నంగా ఎలా చేయ‌చ్చో బాగా తెలుసు. అందుక‌నే ఇలా పేరు మార్చుకుని సినిమాకి ప్ర‌చారం చేస్తుంది. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ ఇది.

70 ఏళ్ల మ‌హిళ ఆత్మ 20 ఏళ్ల అమ్మాయి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తే.. ఎలా ఉంటుంద‌నేది చిత్ర క‌థాంశంగా తెలుస్తుంది. టీజ‌ర్ ఈ సినిమాపై అమాంతం అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ విభిన్న క‌థా చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోన్న స‌మంత ఓ బేబీతో ఏ రేంజ్ స‌క్స‌ెస్ సాధిస్తుందో చూడాలి.