శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:34 IST)

స్నేహితురాలి పెళ్లిలో మెరిసిన సమంత.. దిల్‌రాజుకు అలా షాకిచ్చిందట..?

పెళ్లికి తర్వాత స్టార్ హీరోలతో పాటు సోలోగా అదరగొట్టేస్తున్న సమంత.. తాజాగా మజిలీ సినిమాకు తర్వాత పారితోషికం పెంచాలని నిర్ణయించుకుందట. పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు అంతంత మాత్రంగానే రావడంతో.. పారితోషికం పెంచేయాలని సమంత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పారితోషికాన్ని రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పెంచాలని సమంత చూస్తోందట. 
 
ఇప్పటికే తనను సంప్రదించిన నిర్మాతలకి అదే మొత్తం చెప్పిందని టాక్. నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను సంప్రదించారట. అయితే, ఆమె అడిగిన పారితోషికానికి జడిసి దిల్ రాజు వద్దనుకున్నారని సమాచారం. 
 
ఈ సంగతిని పక్కనబెడితే.. దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత, తన స్నేహితురాలి పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన స్నేహితురాలి వివాహంలో సమంత పాల్గొంది. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో వధువు తెలుపు రంగు దుస్తుల్లో మెరుస్తుండగా, సమంత సహా ఆమె స్నేహితులంతా నీలి రంగు వస్త్రాల్లో ఉన్నారు. కాగా, ప్రస్తుతం మజిలీ చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, తదుపరి '96' రీమేక్‌లో నటిస్తోంది.