సమంత వెర్సెస్ పూజా హేగ్డే, నెట్టింట్లో ముదురుతున్న వివాదం..!
అందాల తారలు సమంత, పూజా హేగ్డే మధ్య వివాదం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. వీరిద్దరికీ ఏమైంది..? అసలు వివాదం ఏంటి అంటారా..? విషయం ఏంటంటే... పూజా హేగ్డే ఇన్‌స్టాలో సమంతను కామెంట్ చేస్తూ.. ఓ కామెంట్ దర్శనమిచ్చింది. అయితే... పూజా తన ఇన్‌స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారని తెలింది.
అయినప్పటికీ... సమంత ఫ్యాన్స్ పూజాపై ఫైర్ అవుతూ... కామెంట్ చేయడం స్టార్ట్ చేసారు. సమంత అభిమానులే కాకుండా సమంత సన్నిహితులు కూడా దీని రియాక్ట్ కావడంతో వార్తల్లో నిలిచింది. సమంత సన్నిహితురాలు, ఓ బేబీ దర్శకురాలు నందినీ రెడ్డి స్పందిస్తూ... సమంత చాలా అందగత్తె అంటూ పొగడుతూ ఆమెకు మద్దతుగా నిలిచారు.
మరోవైపు సమంత ఫ్రెండ్, చిన్మయి శ్రీపాద కూడా సమంతకు సపోర్ట్‌గా నిలిచారు. అంతటితో ఆగలేదు. డైరెక్ట్‌గా సమంత ఎంట్రీ ఇచ్చారు. విక్టరీ సింబల్ చూపిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసారు. అంతేకాకుండా... తనని విమర్శించే వాళ్లే తనకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు. ఈ విధంగా సమంత, పూజా హేగ్డే మధ్య వార్ వార్తల్లో నిలిచింది. మరి.. ఈ వార్ పైన పూజా స్పందిస్తుందో లేదో..?