శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:32 IST)

భయంతో వణికిపోయిన సమంత.. చైతును కూడా విసిగించిందా...

టాలీవుడ్‌లో మాత్రమేకాకుండా దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది సమంత అక్కినేని. పెళ్లి తర్వాత జోరు మరింత పెరిగింది. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సమంత ఈ యేడాదిలో అప్పుడే రెండు హిట్‌లు కొట్టింది. తమిళంలో సూపర్ డీలక్స్, తెలుగులో మజిలీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
 
నేను సినిమాలు సెలెక్ట్ చేసేటప్పుడు, డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఇక ఒప్పుకున్న తర్వాత మొదలవుతుంది నాలో గందరగోళం. షూటింగ్ సమయంలో అనేక అనుమానాలు వస్తాయి, ఇక ఎడిటింగ్ దశకు వచ్చేసరికి మరింత ఎక్కువవుతుందని చెప్పారు. ఇక పెళ్లి తర్వాత నేను, చైతు కలిసి నటించిన మొదటి సినిమా కనుక మజిలీ సినిమా విషయంలో ఆ భయం ఇంకా ఎక్కువగా అనుభవించాను. ఫ్లాప్‌ అవుతుందేమో అని తెగ ఖంగారుపడ్డాను. 
 
ఇదే విషయం చైతుతో మాట్లాడి చాలాసార్లు తనను కూడా విసిగించాను. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్ పాజిటివ్‌గా ఉండటంతో ఆ భయం పోయింది. అప్పుడనిపించింది, నా జీవితంలో నేను బాగా భయపడిన సినిమాలు చక్కగా ఆడాయి. నా సినిమా హిట్టవుతుందా లేదా అనే విషయంలో నా జడ్జిమెంట్‌ పరమ చెత్తగా ఉంటుంది. నా విషయంలో ఇలా ఉంటానే తప్ప మిగిలిన యాక్టర్స్ సినిమాల జయాపజయాలను బాగానే ఊహిస్తానని సమంత వెల్లడించారు.