సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (22:24 IST)

జస్టిస్‌ హేమ కమిటీ ప‌నితీరు భేష్.. మెచ్చుకున్న సమంత

Samantha Ruth Prabhu
జస్టిస్‌ హేమ కమిటీ ప‌నితీరు ప‌ట్ల హీరోయిన్ సమంత స్పందించింది. సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి డబ్ల్యూసీసీ కృషి అమోఘ‌మ‌ని మెచ్చుకుంది. ఈ రిపోర్ట్ ద్వారా ప‌రిశ్ర‌మ‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 
 
సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలు. అయినా ఇప్పటికీ వీటి కోసం చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారని సమంత గుర్తు చేసింది. 
 
కానీ వారి ప్రయత్నాలకు ఫలితం శూన్యం. కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై త‌గిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నానని సమంత వెల్లడించింది.