శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (21:14 IST)

ఆ ఒత్తిడి నాపై ఎక్కువే... 'ఓ బేబీ' సమంత...

ఓ బేబీ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకుంది సినీ నటి సమంత. 24 యేళ్ళ యువతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. సమంత నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో నటించిన సినిమాల కన్నా ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని సమంత ఇప్పటికే తెలిపింది.
 
చెప్పిన విధంగానే సినిమా హిట్ టాక్‌తో ముందుకు వెళుతుండటంతో సమంత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తామని ముందే చెప్పాము. చెప్పినట్లుగానే ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్నారు. నన్ను మంచి సినిమాలు చేయమని అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు.
 
డబ్బులు సంపాదించడం కన్నా మంచి క్యారెక్టర్ చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే బాగా గ్యాప్ ఇచ్చి ఓ బేబీ సినిమాలో నటించాను. నాకు మంచి పేరు వచ్చింది. నా కుటుంబ సభ్యులందరూ నన్ను మెచ్చుకున్నారు.

ఈ సినిమా విజయానికి నేను ఒక్కదాన్నే కారణం కాదు... డైరెక్టర్, నాతో పాటు నటించిన యాక్టర్లు, సినిమా యూనిట్ మొత్తం అని చెబుతోంది సమంత. నాపై అభిమానులు ఒత్తిడి తెచ్చినా పట్టించుకోనని.. అయితే సినిమాలను మాత్రం వేగంగా చేయకుండా తనకు గుర్తింపు వచ్చే సినిమాల్లో మాత్రమే నటిస్తానంటోంది.