'ఓ బేబీ' వెంటపడే నాగశౌర్య... సమంత యాక్షన్ అదుర్స్... రివ్యూ రిపోర్ట్
సమంత నటించిన ఓ బేబీ చిత్రం ప్రీమియర్ షో టాక్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సమంత యాక్షన్ అదిరిపోయిందని అంటున్నారు. సమంత ఎప్పటికప్పుడు నూతన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ ఓవర్సీస్ లో విడుదలైంది. అక్కడి టాక్ ఎలా వుందో చూద్దాం.
అనుకోకుండా ఒక సంఘటన జరగడంతో లక్ష్మి అనే వృద్ధురాలు యువతిగా మారిపోతుంది. ఆమె సమంత. అలా యువతిగా మారిపోయిన సమంతకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి... వృద్ధురాలికి స్నేహితుడుగా వున్న రాజేంద్ర ప్రసాద్ ఆమెతో ఎలా ప్రవర్తంచాడు, కొడుకు, మనవడు ఎలా మసలుకున్నారనేవి ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంత వెంటపడే క్యారెక్టర్లో నాగశౌర్య సూపర్‌గా యాక్ట్ చేశాడు. ఇలా మొత్తమ్మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.
సమంత - నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన విభిన్న కథా చిత్రం ఓ..బేబీ. ఈ మూవీ ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. జులై 5న ఓ.. బేబి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్ చిత్ర విశేషాలను తెలియచేస్తూ... ఓ బేబికి నేను బాయ్ ఫ్రెండ్. ఓ బేబి అనే ఆవిడ ఓల్డ్ ఏజ్ లేడీ. ఆ పాత్రను సీనియర్ యాక్టర్ లక్ష్మి గారు యాక్ట్ చేసారు. కొంతమందితో యాక్ట్ చేసేటప్పుడు ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఎన్టీరామారావు గారితో యాక్ట్ చేస్తుంటే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది.
అలాగే ఎస్వీఆర్ గారితో యాక్ట్ చేస్తుంటే ఆటోమెటిక్‌గా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఎందుకు మీకు ఎక్సైట్‌మెంట్ అంటే... అంతకుముందు వాళ్లు చేసిన పని. బామ్మ మాట బంగారు బాటలో భానుమతి గారితో యాక్ట్ చేసాను. బృందావనం సినిమాలో అంజలి దేవిగారితో యాక్ట్ చేసాను. ఈ సినిమాలో లక్ష్మీ గారితో యాక్ట్ చేసాను.
ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో వర్క్ చేయడం అంటే పెర్‌ఫార్మెన్స్ రెడీమేడ్‌గా వచ్చేస్తుంటుంది. ఈ సినిమాలో లక్ష్మీ గారితో యాక్ట్ చేయడం నాకు మంచి ఎక్స్‌పీరియన్స్. లక్ష్మీ గారు సమంత ఎలా అయ్యింది అనేది అందరిలో ఉన్న ప్రశ్న. లక్ష్మీ గారు నాకు ఈ చిత్రంలో గర్ల్ ఫ్రెండ్ అయితే.. ఆమె సమంతగా మారితే తర్వాత నా పరిస్థితి ఏంటి.? ఇలా.. ఈ సినిమా అందరిలో ఇంట్రస్ట్ కలిగిస్తుంటుంది.
నేను చాలా సినిమాలు చేసాను కానీ.. ఇది కొత్త ఎక్స్‌పీరియన్స్. ఇది కొరియన్ ఫిల్మ్ మిస్ గ్రానీకి రీమేక్. ఆ సినిమా చూసాము కథ తీసుకున్నాం అని కాకుండా.. మన కథగా ఉండాలంటే ఏమేమి కావాలి... అని ఆలోచించి నందినీ రెడ్డి, రైటర్ లక్ష్మీ భూపాల్ చాలా అద్భుతంగా కథను తీర్చిదిద్దారు.
సమంత గురించి చెప్పాలంటే.. ఎంతో భయంతో.. భక్తితో ఈ సినిమా చేసింది. కొన్ని సీన్స్ చేసేటప్పుడు నేను సైలెంట్‌గా ఉండాలి తను కామెడీ చేయాలి. అప్పుడు సమంత నా దగ్గరకి వచ్చి సార్.. ఎలా చేయాలో చెబుతారా..? దయచేసి చెబితే బాగుంటుంది అని అడిగి తెలుసుకుని మరీ ఆ పాత్ర చేసింది. ది బెస్ట్ అనేలా ఈ సినిమాలో నటించింది. మనకు మంచి పాత్ర వచ్చినప్పుడు కన్నా.. బాగా చేసాం అనిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతాం.
ఈ సినిమా చేస్తున్నప్పుడు ఓ నాలుగైదు సార్లు.. అబ్బా ఈ సీన్ భలే ఉందే అని చాలా బాగా హ్యాపీగా ఫీలైన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా రావడానికి కారణం ఆ క్యారెక్టర్స్. థియేటర్లో ఓ కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారు. 100% గ్యారెంటీ. ఇందులో ఏమాత్రం తేడా ఉన్నా నన్ను చొక్కాపట్టుకుని అడగొచ్చు. ఖచ్చితంగా ఓ బేబి అందరికీ నచ్చుతుంది అని చెప్పారు.