సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (16:22 IST)

సమంత పుట్టినరోజు.. వద్దన్నా సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చిన ఫ్రెండ్స్

samantha
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు ఇటీవల ఏప్రిల్ 28న తన 36వ పుట్టినరోజు జరుపుకుంది. ప్రస్తుతం ఈ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకుని సర్ ప్రైజ్ ఏమీ అక్కర్లేదని స్నేహితులతో సమంత చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
పుట్టినరోజు నాడే కాకపోయినా.. సమంత పుట్టిన రోజుకు రెండు రోజుల తర్వాత.. సమంత రూత్ ప్రభుకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సర్ ప్రైజ్ పార్టీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.