శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (11:09 IST)

ఆమె మంచి మనసున్న వ్యక్తి.. జీవితంలో సంతోషంగా వుండాలి.. చైతూ

Samantha Akkineni
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మాజీ భర్త నాగ చైతన్య తొలిసారిగా స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. ఆమె మంచి మనసున్న వ్యక్తి… ఆమె జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. 
 
చట్టప్రకారం విడాకులు తీసుకున్నామని చైతూ వెల్లడించారు. తాము విడిపోయి రెండేళ్లు అవుతుందని.. చట్టప్రకారం విడాకులు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం తమ జీవితాల్లో ముందుకు సాగిపోతున్నానని.. జీవితంలో ప్రతి దశను గౌరవిస్తున్నానని చెప్పారు. 
 
నెట్టింట్లో వచ్చే వదంతులు ఇబ్బంది కలిగించినా.. ఒకరిపై ఒకరికి గౌరవం వుందని చైతూ వెల్లడించారు. తన గతంలో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం వల్ల ఆ వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యిందని చైతూ చెప్పుకొచ్చాడు. 
 
తన పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారని.. వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఫెయిల్యూర్ సినిమాలను ఖాతాలో వేసుకుంటుందని... త్వరలో అన్నీ మారుతాయని.. కెరీర్‌లో ఎత్తుపల్లా సహజమన్నాడు. ప్రస్తుతం కస్టడీ సినిమాపై నమ్మకంతో వున్నానని చైతూ చెప్పాడు.


Naga Chaitanya
Naga Chaitanya